Header Banner

అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. జాబ్, స్టడీ చెయ్యాలి అనుకుంటే ఇవి మస్ట్​! యూఎస్​ కాన్సులేట్​ జనరల్ స్పష్టీకరణ!

  Sat Mar 01, 2025 18:06        U S A

USA: మనలో చాలా మందికి అమెరికా(America)లో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలనే కల ఉంటుంది. కానీ ఆ కలను నెరవేర్చుకోవాలంటే బోలెడంత డబ్బుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలి. కొంత మందిలో డబ్బు ఉన్నా నైపుణ్యం మాత్రం ఉండదు. అలాగే మరికొంత మందిలో నైపుణ్యం ఉన్నా, డబ్బులు ఉండవు. కానీ నైపుణ్యం ఉన్నవారిని మాత్రం అమెరికా చదువు, కొలువు రెండూ ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తే ఆరెంకల జీతంతో పాటు విలాసవంతమైన లైఫ్​ను అనుభవించవచ్చని చాలా మంది భావన. ఈ భావన నిజమే కానీ నైపుణ్యాలు లేకపోతే మాత్రం అమెరికాలో కొలువులు అనేవి రావు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​( Donald Trump) అధికార పీఠం ఎక్కిన తర్వాత అక్రమంగా వలస వచ్చిన వారందరినీ విమానాల్లో వారి దేశాలకు పంపించేస్తున్నారు. అందుకే నైపుణ్యం ఉంటే అక్కడ కొలువులు ఈజీగా సాధించవచ్చు. ఈ మాటను స్వయంగా యూఎస్​ కాన్సులేట్​ జనరల్​ జెన్నీఫర్​ లార్సన్​నే అన్నారు.

 

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు!

 

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అంశంపై గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్(Kakatiya University Senate Hall)​లో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్​ ఎన్​.ప్రసాద్​( Principal N. Prasad) అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెన్నీ లార్సన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు కేయూ పూర్వ విద్యార్థి, అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగిన ఎన్​ఆర్​ఐ పులి రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో అమెరికా కాన్సులెట్​ జనరల్​ మాట్లాడుతూ, విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కోసం విద్యార్థి విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచుకోవాలని ఆమె సూచించారు. న్యాయబద్ధమైన వీసాలపై అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. అమెరికాలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు నాలుగు వేల వరకు ఉన్నాయని, ప్రపంచ స్థాయి విద్యార్థులు అమెరికాకు వస్తున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. అందుకే విలువ ఆధారిత విద్యను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. సాంకేతిక రంగంలో నూతన పోకడలను అందిపుచ్చుకోవాలని అమెరికా కాన్సులెట్​ జనరల్​ జెన్నీఫర్​ లార్సన్​ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం, చదువుతో పాటు ఉపాధి అవకాశాలు, వీసా నిబంధనలు, ఇంటర్న్​షిప్​లు తదితర అంశాలపై విద్యార్థుల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్​రెడ్డి ఇంజినీరింగ్​ కళాశాలల ప్రిన్సిపాళ్లు కె. భిక్షాలు, ఎన్.రమణ, వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Students #Dead